* పాలమూరు కార్పొరేషన్‌లో నయా విధానం
* -పని చేస్తే టెండర్ వేసేది మనమే అంటున్న కాంట్రాక్టర్లు
* కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్న మున్సిపల్, సంబంధిత అధికారులు
* మేము రోడ్డు వేశాం టెండర్‌లో పాల్గొనొద్దంటూ తోటి కాంట్రాక్టర్లకు సమాచారం
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): మహబూబ్‌నగర్ కార్పొరేషన్ తీరు ఆశ్చర్యకరంగా ఉంది. కొంచెం దూరమైన పర్వాలేదు జర్ర మా మహబూబ్ నగర్ ము న్సిపాలిటీకి వచ్చి చూడండి. మహిళలైతే ఎట్లాగో ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు ల్లో ప్రయాణించి స్వేచ్ఛగా మహబూబ్ నగ ర్ మున్సిపల్ పరిధికి చేరుకోవచ్చు.
పురు షులైతే కొంత ఖర్చు అవుతుందేమో కాగా ఇక్కడ అమలు అవుతున్న నూతన విధానా లను చూస్తే ఖర్చు అయిన ఆ డబ్బులు కూ డా వారికి గుర్తుకురాని పరిస్థితిని వస్తుంది. ఇక్కడ జరుగుతున్న కాంట్రాక్టు పనులను చూస్తే ఆశ్చర్యానికి గురి అవుతారు. అధికా రులు కాంట్రాక్టర్లు అనుసంధానంగా ఉం టూ ముందుగానే పనులు చేసుకుంటూ త ర్వాత టెండర్లు పాల్గొంటూ నాణ్యతలేని పనులకు అవకాశం ఏర్పడుతుంది.
ముందే పనులు చేస్తారు... తర్వాతే టెండర్ ...
మా వార్డులో డ్రైనేజీలు కట్టండి... మా గల్లీలో సిసి రోడ్లు వేయండి అంటూ ప్రజలు మొరపెట్టుకుంటే చాలు.. అధికారులు అటు కాంట్రాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. పని ఉందని చెప్పడమే తరువాయి చక చకా ఆ పనులను పూర్తి చేసి కాంట్రాక్టర్ శిరవేగంగా టెండర్ వేసేందుకు తన ప్రయత్నాన్ని మొద లుపెడతాడు. ఈ విధానంకు ప్రస్తుతం మహబూబ్ నగర్ పురపాలికలో వెలుగు లోకి వచ్చింది.
పట్టణంలో కొన్నేళ్లుగా ముందుగానే పనులు చేసి తర్వాత టెండర్ వేసేందుకు శ్రీకారం చుట్టిన సంఘటనలు నేటికీ జరుగుతున్నాయని విషయాలు వెలు గులోకి వస్తున్నాయి. ఇలా కూడా చేయొ చ్చని ఎవరు చెప్పారు ఏమో తెలియదు కానీ నాణ్యత ప్రమాణాలు అటు ఉంచితే.. సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు శరవేగంగా జరిగేం దుకు ఆస్కారం మహబూబ్ నగర్ వేదికగా నిలుస్తుంది.
వాట్సాప్ గ్రూపులో టెండర్ వెయ్యొద్దంటూ ప్రచారం..
మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులలో వివిధ పనులు చేసినప్పటికీ ఆ పనికి సంబం ధించిన వర్కింగ్ ఆర్డర్ నెంబర్లను పొందుప రుస్తూ ఈ పనులు నేను చేయడం జరిగింది.. ఎవరు కూడా టెండర్‌లో పాల్గొనకూడదు. గమనించండి అందరూ సహకరించండి అంటూ కాంట్రాక్టర్లు వారికి సంబంధించిన గ్రూపులో మెసేజీలు పెట్టుకుంటున్నారు. ఇందుకు మున్సిపల్ సంబంధిత అధికారు లు కూడా మద్దతు తెలపడం గమనార్హం.
తనిఖీలు శూన్యం...
ముందే టెన్ పనులు చేసి తర్వాత టెండర్ వేస్తే ఆ పని నాణ్యతను అధికారులు ఎలా లెక్కిస్తారు. అనే సందేహం పట్టణవా సుల్లో సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. తనిఖీలు చేయవలసిన అధికారులు మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని సందేహం నెలకొంటుంది. మున్సిపల్ కా ర్పొరేషన్‌గా ఎదిగిన మహబూబ్ మున్సిప లలో ఇలాంటి ప్రక్రియలు జరగడం సూచన యంగా కనిపిస్తుంది.
మున్సిపాలిటీకి అత్యవ సర పరిస్థితి ఉంటే కొంత మేరకు వేగంగా పనులు చేసుకునేందుకు డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. లక్షల్లో ముంద స్తుగా పనులు చేసి తర్వాత టెండర్ వేసే వెసులుబాటు ఉండదు. ఈ విషయాలు అన్ని అధికారులకు తెలిసిన నియంత్రించ డంలో మాత్రం వెనకంజ వేస్తున్రు. ఇకనైనా అధికారులు పూర్తిస్థాయిలో నిబంధనలు పాటిస్తూ నాణ్యత గల పనులను చేసి భవి ష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాల్సిన అవ సరం ఎంతైనా ఉంది.
కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది
ఏ మున్సిపాలిటీలో అయినా టెండర్ వేయకముందు కొన్ని పనులు చేసుకునే అవకాశంలు ఉంటాయి. ఆదిశగానే చర్య లు తీసుకుంటున్నాం. ప్రస్తుతము ఆ పం డ్లు పూర్తిగా ఆపివేయడం జరిగింది. ముందుగా పండ్లు చేసి తర్వాత టెండర్ వేయడం ప్రస్తుతం జరగడం లేదు. నిబం ధన మేరకు చర్యలు తీసుకుంటున్నాం.
-మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మహబూబ్ నగర్