ఆఫ్గన్, కివీస్ ఏకైక టెస్టు
నోయిడా: అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ రెండో రోజు కూడా రద్దు కావడం ఆసక్తి కలిగించింది. నోయిడా వేదికగా సోమవారం నుంచి మొదలు కావాల్సిన టెస్టు మ్యాచ్ ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో తొలి రోజు ఒక్క బంతి పడకుండానే రద్దు అయింది. తాజాగా మంగళవారం మరోమారు గ్రౌండ్‌ను పరిశీలించిన అంపైర్లు ఆట సాధ్యమైనప్పటికీ ఔట్‌ఫీల్డ్ పేలవంగా ఉండడంతో రెండో రోజు కూడా రద్దుకే మొగ్గు చూపారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కవర్లు, ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సూపర్ సాపర్లు పంపినప్పటికీ గ్రౌండ్‌ను సిద్ధం చేయడంలో నోయిడా అథారిటీ విఫలమైంది. సిబ్బంది కొరతే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. కాగా నోయిడా మైదానంపై విమ ర్శలు వస్తున్న వేళ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరిస్తున్న శ్రీనాథ్ ఎటువంటి రిపోర్టు ఇస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.