తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ పోలింగ్ సందర్భంగా దారుణ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో ఓటర్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెంప చెళ్లుమనిపించాడు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ క్యూలైన్ లో రాకుండా నేరుగా బూత్ లోకి వెళ్లడంపై ఓటర్ నిలదీశాడు. ఆగ్రహానికి గురైన ఓటరుపై శివకూమర్ దాడికి పాల్పడ్డాడు. తక్షణమే ప్రతిఘటించిన ఓటర్ అతని చెంపపై కొట్టాడు. అనంతరం వైకాపా అభ్యర్థి అనుచరులు లోనికి వచ్చి అతన్ని బయటకు తీసుకువెళ్లి విచక్షణారహితంగా దాడి చేస్తూ పిడిగుద్దులు కురిపించారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సామాన్య ఓటరుపై దాడి చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.