calender_icon.png 2 October, 2024 | 1:56 PM

స్వచ్ఛ భారత్ అభియాన్‌కు 10 ఏళ్లు

02-10-2024 11:35:40 AM

న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పదేళ్లు పూర్తి అయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. స్వచ్ఛతా హి సేవలో పలువురు ప్రముఖులు భాగస్వాములయ్యారని మోడీ చెప్పారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛభారత్ చేపట్టారని పేర్కొన్నారు. సేవా పక్వాడా కార్యక్రమంలో 28 కోట్ల మంది పాల్గొన్నారని ఆయన వెల్లడించారు.

స్వచ్ఛభారత్ కు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ నరేంద్ర మోడీ అభినందించారు. స్వచ్ఛభారత్ విషన్ అనేది ప్రజల ఉద్యమంగా మారిందన్నారు. గాంధీజీ స్వచ్ఛభారత్ కలను సాకారం చేస్తామని ప్రధాని పేర్కొన్నారు. సమిష్టి కృషి వల్లే స్వచ్ఛ భారత్ సాధ్యమన్నారు. దేశవ్యాప్తంగా సీవరేజ్ ప్లాంట్ల ద్వారా మురుగు శుద్ధి చేయలన్నారు. పదేళ్లుగా కోట్లాది మంది వ్యక్తిగత లక్ష్యాలుగా స్వచ్ఛభారత్ చేపట్టారని తెలిపారు. సేవా పక్యాడా కింద 15 రోజుల్లో 27 లక్షల కార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు. ఢిల్లీలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అమృత్2.0, క్లీన్ గంగ, గోవర్ధన్ యోజన కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు.