calender_icon.png 9 April, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్ల వృద్ధిని ఏడాదిలో దెబ్బతీశారు

07-04-2025 01:39:33 AM

‘ఎక్స్’లో మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో సాధించిన తెలంగాణ ప్రగతిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దారుణంగా దెబ్బతీశారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కోవిడ్ కాలం మినహాయిస్తే బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో వార్షిక వృద్ధిరేటు 25.62 శాతం సాధించామన్నారు.

రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత 2024 ఆర్థిక సంవత్సరంలో 1.93శాతం తగ్గిందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధితో పాటు హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీశారని ఆదివారం హరీశ్‌రావు ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు.

హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్, ఫార్మాసిటీ రద్దు, మెట్రోలైన్ ప్రణాళికల్లో అనవసర మార్పులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే కాక రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఒకప్పుడు వేగంగా ఎదిగిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలతో ఇప్పుడు వెనకబాటుకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.