calender_icon.png 3 March, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాన్స్ జెండర్ల అరాచకాలకు చెక్ పెట్టిన సరూర్ నగర్ పోలీసులు

02-03-2025 12:28:53 PM

10 మంది ట్రాన్స్ జెండర్ల అరెస్ట్

ఎల్బీనగర్,(విజయక్రాంతి): సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీ&టీ  కాలనీ, సరూర్ నగర్ చెరువు కట్టకింద ఉన్న కల్లు కాంపౌండ్  సమీపంలో నివాసం ఉంటూ  రాత్రుళ్ళు రోడ్లపైకి వచ్చి  పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారు. దీంతో ట్రాన్స్ జెండర్ల ఇండ్లపై శనివారం రాత్రి సరూర్ నగర్ పోలీసులు దాడులు నిర్వహించి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్స్ జెండర్లు వారుంటున్న  ఏరియాను రెడ్ లైట్ ఏరియాగా మార్చి స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తూ, ఇష్టారీతిన సెక్స్ దందా(Sex Racket) చేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ట్రాన్స్ జెండర్లను అరెస్ట్ చేశారు. వీరు ఎక్కడి వారు? ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారని? విచారణ చేస్తున్నారు. వీరిని విచారణ అనంతరం రిమాండ్ కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.