01-04-2025 12:00:00 AM
కల్లూరు, మార్చి31:- పట్టణంలో అంబేద్కర్ నగర్ కి చెందిన కొత్తపల్లి కోడెత్రాస్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. విషయం తెలు సుకున్న సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సం డ్ర వెంకట వీరయ్య ఆదేశాల మేరకు ఆయన ప్రధాన అనుచరులు బి ఆర్ ఎస్ పార్టీ మం డల యూత్ అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ కొత్తపల్లి కోడెత్రాసు కు వైద్య ఖర్చులు నిమిత్తం 10 వేల రూపాయలను సోమవా రం కోడెత్రాసుకి అందజేశారు. సండ్ర చరవాణి ద్వారా కోడె త్రాసు ఆరోగ్య పరిస్థి తులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాటమనేని వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ డైరెక్టర్ క ల్లూరు సొసైటీ చైర్మన్ బోబోలు లక్ష్మణరా వు, మేకల కృష్ణ, ఉబ్బన వెంకటరత్నం, కొరకొప్పు ప్రసాద్, అజ్మీర్ జమలయ్య, శీలం శెట్టి కిరణ్, కంభంపాటి రమేష్, మోర్తాల పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.