calender_icon.png 18 March, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

18-03-2025 01:19:45 AM

 జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, మార్చి 17 (విజయక్రాంతి) : జిల్లాలో ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న పది వార్షిక పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, డిసిపి ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల, జైపూర్ ఎసిపిలు ప్రకాష్, వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్యలతో కలిసి పది పరీక్షలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.

ఈ నెల 21న ఫస్ట్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-1, పార్ట్-2, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న థర్డ్ లాంగ్వేజ్, 26న మాథమెటిక్స్, 28న సైన్స్ పార్ట్-1 ఫిజికల్ సైన్స్, 29న సైన్స్ పార్ట్-2 బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్, 3న ఓ.ఎస్.ఎస్.సి. మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సాన్‌ఇట్ & అరబిక్), ఎస్.ఎస్.సి. ఒకేషనల్ కోర్స్ (థియరీ), 4న ఓ. ఎస్. ఎస్సి. మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సాన్రెట్ & అరబిక్) పరీక్షలు ఉంటాయన్నారు.

49 పరీక్ష కేంద్రాలు పది పరీక్షల కోసం జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. 49 మంది ముఖ్య పర్యవేక్షకులు, 49 మంది శాఖ అధికారులు, 4-సి సెంటర్ కస్టోడియన్లు, 461 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. 9,189 మంది రెగ్యులర్, 221 మంది ఒక్కసారి అనుత్తీర్ణులైన విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

విద్యార్థులు పరీక్షా సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య, మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.