01-03-2025 05:25:40 PM
డిఈఓ యాదయ్య...
మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలో పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. శనివారం జడ్పీ బాలుర పాఠశాలలో పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై మండల విద్యధికారులకు, చీప్ సూపరిండెంట్, డెపార్ట్ మెంటల్ అధికారులు, రూట్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు 7 పేపర్ లు ఉంటాయని, ఆన్సర్ షీట్ లు 24, 12 పేజీల బుక్లెట్ల రూపములో ఉంటాయని, పరీక్షలు ఈ నెల 21 నుంచి మార్చి 4 వరకు జరుగుతాయన్నారు. అనంతరం చీప్ సూపరిండెంట్, డెపార్ట్ మెంటల్ అధికారుల విధులను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ పరీక్షల అధికారి డి. దామోదర్ రావు, ఆయా మండలాల విద్యాధికారులు, చీప్ సూపరింటెండెంట్, డెపార్ట్ మెంటల్ అధికారులు పాల్గొన్నారు.