calender_icon.png 22 December, 2024 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు

02-08-2024 01:04:36 AM

జులై నెలలో రూ.1.86 లక్షల కోట్లు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో వస్తు సేవల పన్ను( జీఎస్టీ) వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. జులై నెలకు రూ.1.82 లక్షల కోట్లు వసూళ్లు జరిగినట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. గత ఏడాది ఇదే నెలలో రూ.1.74 లక్షల కోట్లు పన్ను వసూళ్లు జరిగాయి. అప్పటితో పోలిస్తే వసూళ్లు 10 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అంటే ఏప్రిల్ నెలనుంచి జులై మధ్య రూ.6.56 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు నమోదయినట్లు కేంద్రం తెలిపింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లు కావడం గమనార్హం.

మరోవైపు జీఎస్టీ రేట్లను హేతుబద్ధకరించాలని కేంద్ర ప్రభ్వుం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాలుగు రకాల రేట్లు ఉండగా వాటిని మూడుకు కుదించాలని భావిస్తోంది. ఇందుకోసం ఓ కమిటీని కూడా నియమించింది. అదే జరగితే మరిన్ని వస్తువులు జీఎస్టీ పరిధిలోకి రావడంతో పాటుగా కొన్ని వస్తువులపై పన్ను రేట్లు తగ్గి వినియోగదారుడికి మరింత చౌకగా లభించే అవకాశం ఉంటుంది.