calender_icon.png 12 October, 2024 | 8:50 AM

వరదలో చిక్కుకున్న 10మంది చెంచులు

04-09-2024 12:00:00 AM

డ్రోన్ల సాయంతో గుర్తించి కాపాడిన పోలీసుల

నల్లగొండ, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): చేపల వేటకు వెళ్లి, వాగులో చిక్కుకున్న 10మంది చెంచులను పోలీసులు డ్రోన్ల ద్వారా గుర్తించి కాపాడారు. నల్లగొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లి గ్రామానికి చెందిన జలల్ గురవయ్య, అతడి భార్య, ముగ్గురు కుమారులు, కోడలు, ఇద్దరు ఆరేండ్లలోపు మను మరాళ్లు, మనమడుతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం సి ద్ధాపూర్ శివారులో దుందుభి వాగులో మూడు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లారు. వర్షాల కారణంగా వాగులో వరద ఒక్కసారిగా పెరగడంతో మధ్యలోని ఎత్తున ప్రాంతానికి చేరుకున్నారు. రెండు రోజులుగా వరద తగ్గకపోవడంతో అక్కడే ఉన్నారు.

ఆహారం లేక చిన్నారులు అల్లాడుతుండటంతో స్థానికులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట, నల్లగొ ండ పోలీసులు సోమవారం సాయంత్రం ర ంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. డ్రోన్ల సాయంతో బాధితుల ఆచూకీ గుర్తించి బయటకు తీసుకొచ్చేందుకు సోమశిల ను ంచి గజ ఈతగాళ్లను రప్పించారు. అప్పటకే రాత్రి కావడంతో వారిని ఒడ్డుకు తీసుకురావడం సాధ్యం కాలేదు. మంగళవారం ఉద యం ఫైర్ సిబ్బంది సాయంతో తాళ్లుకట్టి వ రదలో చిక్కుకున్న 10 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దేవరకొండ, అచ్చంపేట ఎ మ్మెల్యేలు నేనావత్ బాలూనాయక్, చిక్కుడు వంశీకృష్ణ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు ప్రాథమిక చికిత్స అ ందించి వైద్యం కోసం అచ్చంపేట దవాఖానకు తీసుకెళ్లారు. 

కావడి కట్టి ప్రాణాలు కపాడిన గ్రామస్థులు

సూర్యాపేట (విజయక్రాంతి): గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని కేశవపురం రుద్రమాదేవి చెరువు అలుగు పారుతున్నది. నీ బరు రోడ్డు పై నుంచి ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం గ్రామానికి చెందిన పడిసెల కుటుంబరావుకు తేలు కుట్టింది. చికిత్స నిమిత్తం దవాఖానకు తీసుకెళ్లేందుకు గ్రామస్థులు తంటాలు పడ్డారు. కర్ర కావడికి జోలే కట్టి అందులో కుటుంబరావును కూర్చోబెట్టి వాగును దాటి ఆసుపత్రికి తీసుకెళ్లారు.