- ప్రతిపాదించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- 16న అసెంబ్లీలో ఆమోదించే అవకాశం
ఖమ్మం, డిసెంబర్ 11 (విజయక్రాంతి): రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పది కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలు స్తున్నది. ఈ మేరకు మంత్రి పొంగులేటి స్వయంగా పది కొత్త పంచాయతీలను ప్రతిపాదించగా వాటికి ప్రభుత్వం నుంచి ఆమో దం కూడా లభించినట్లు సమాచారం.
మేజ ర్ గ్రామ పంచాయతీలను విడగొట్టి కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త పం చాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయా పంచాయతీల్లో తీర్మానాలు కూడా ఆమోదింపజే యాల్సి ఉంటుంది.
నూతన పంచాయతీలు ఇవే
ఇప్పటి వరకు జీళ్లచెరువు పంచాయతీ పరిధిలోని ఉడతలగూడెం, ఎర్రగడ్డతండాతో పాటు దుబ్బతండా గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బుధవారం మూడు గ్రామ పంచాయతీల్లో అధికారులు ప్రత్యేకించి సమావేశాలు నిర్వహించి, ఏకగ్రీవంగా తీర్మానాలను ఆమోదించారు.
గోపాలరావుపేట గ్రామాన్ని కూడా ప్రత్యేక గ్రామ పం చాయతీగా ఏర్పాటు చేయనున్నారు. తిరుమలాయపాలెం మండలం బంధంపల్లి, జూలుతండా, ఖమ్మం రూరల్ మండలం మద్దివారిగూడెం, సీతారాంపురం, గుండ్లతండా, వాల్యతండా, కూసుమంచి మం డలంలోని కొన్ని గ్రామాలను కొత్త గ్రామ పంచాయతీలుగా చేయనున్నారు.
అదే విధంగా కామేపల్లి మండలం గోవింద్రా ల పంచాయతీ పరిధిలో ఇప్పటి వర కు గోవింద్రాలబంజర గ్రామాన్ని కూడా విడదీసి, కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నెల 16వ తేదీన అసెంబ్లీలో వీటి ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలిపే అవ కాశం ఉందని తెలుస్తున్నది.
అసెంబ్లీ ఆమోదం లభిస్తే కొత్త పంచాయతీల్లోనే గ్రామ పంచాయతీల ఎన్నికలు జరుగుతాయి. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం పట్ల పాలేరు నియోజకవర్గం ప్రజలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు.