calender_icon.png 26 December, 2024 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధితులకు రూ.10 లక్షలు

18-09-2024 04:01:33 AM

ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఔదార్యం 

ఖమ్మం, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మున్నేరు వరద బాధితుల పట్ల ఖమ్మం ఛా ంబర్ ఆఫ్ కామర్స్ ఔదార్యం చూపించింది.  మున్నేరు వరద బాధితులను ఆదుకునేందు కు చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున రూ.10. 11 లక్షల చెక్కును మంగళవారం ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వర రావు, అధ్యక్షుడు చిన్నికృష్ణారావు, ప్రధాన కార్యదర్శి మెంతుల శ్రీశైలం, సహాయ  కార్యదర్శి మన్నెం కృష్ణయ్య, కోశాధ్యక్షుడు తల్లాడ రమేష్, సెంట్రల్ ఈసీ సభ్యులు కైలాసపు వేణుగోపాలరావు, పాయల నాగేశ్వర రావు, నేరెళ్ల శేషగిరిరావు, విడాల శ్రీనివాస రావు, దిగుమతి శాఖ అధ్యక్షుడు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, కార్యదర్శి ముత్యం ఉప్పల్‌రావు, మిర్చిశాఖ అధ్యక్షుడు మాటేటి నాగేశ్వరరావు, కార్యదర్శి యడ్లపల్లి సతీష్, కోల్ స్టో రేజ్ శాఖ అధ్యక్షుడు మలిశెట్టి వెంకటేశ్వర్లు, ఎగుమతి శాఖ అధ్యక్షుడు నల్లమల ఆనంద్, దాల్ మిల్ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు వేములపల్లి వెంకటేశ్వరరావు, తేరాల ప్రవీణ్, జనరల్ కార్యవర్గ సభ్యులు కమర్తపు మురళి, బండి సతీష్, మల్లెల అప్పారావు, సారిక పాపారావు, సిరికొండ వెంకటేశ్వర్లు, గొడవర్తి నాగేశ్వరరావు, షేక్ తాజుద్దీన్, సభ్యులు కల్వకుంట్ల గోపాలరావు పాల్గొన్నారు