- రాజస్థాన్‌లో అన్నదాతకు పోలీసుల ఝలక్
- రేపటిలోగా చెల్లించాలని నోటీస్
- లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
జైపూర్, డిసెంబర్ 22: ఆత్మహత్యను ఆపడానికి పోలీసులకైన ఖర్చులను చెల్లించాలని ఓ రైతుకు రాజస్థాన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ఘట న రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మేరకు రూ.10 లక్షలు చెల్లించాలని రైతు విద్యాధర్‌కు పోలీసులు ఫైన్ వేశా రు. ఝంఝం జిల్లాలో విద్యాధర్ యాదవ్‌కు చెందిన భూమిని గతంలో ఓ సిమెంట్ కంపెనీ కోసం సేకరించారు.
ఇందుకోసం అతనికి రూ.3 కోట్లు చెల్లిం చేందుకు సిమెంట్ కంపెనీ అంగీకరించింది. అయితే రోజులు గడుస్తున్నా విద్యాధర్‌కు నష్టపరిహారం అందలేదు. అధికారులను, కంపెనీ ప్రతినిధులను కలిసినా అతనికి డబ్బులు చెల్లించలేదు. ఈ క్రమంలో విసిగి వేసారిన విద్యాధర్ తన కుటుంబంతో కలిసి సామూహిక ఆత్మహత్య (సజీవదహనం) చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
దీంతో ఈ నెల 10వ తేదీన విద్యాధర్ కుటుం బం ఆత్మహత్య చేసుకోవడానికి చితిపై కూర్చున్నది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విద్యాధర్ కుటుంబం ఆత్మహత్య చేసుకో కుండా నిలువరించారు. ఈ క్రమంలో విద్యాధర్‌కు పోలీసులు జరిమానా విధిస్తూ నోటీస్ జారీ చేశారు.
మీ కుటుంబ ఆత్మహత్యను ఆపడానికి ఒక ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీ సహా 99 మంది పోలీస్ సిబ్బందిని అక్కడకు పంపామని, ఇందుకోసం రూ. 9,91, 557 ఖర్చు అయిందని ఆ నోటీసులో పేర్కొన్నారు.
దీంతో రాష్ట్ర ఖజానాపై భారం పడిందని తెలిపారు. ఈ నెల 24లోగా ఎస్పీ ఆఫీసులో ఉన్న సం బంధిత బ్యాంకు ఖాతాలో నోటీస్‌లో పేర్కొన్న మొత్తాన్ని జమ చేయాలని సూచించారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.