calender_icon.png 3 April, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైరాలో బస్సు లారీ ఢీకొని పది మందికి గాయాలు..

01-04-2025 11:43:39 PM

వైరా: బస్సు లారీ ఢీకొని పదిమంది గాయాల పాలైన సంఘటన వైరాలోని క్రాస్ రోడ్ సెంటర్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం నుండి మణుగూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్థానిక రింగ్ రోడ్డు వద్ద తల్లాడ వైపు నుండి ఖమ్మం వెళ్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు.