27-03-2025 01:48:04 AM
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
దేవరకొండ, మార్చి 26 (విజయక్రాంతి) : పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం కొండమల్లేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు.
పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ భద్రత, పరిసరాల్లో 144 సెక్షన్ అమలు, జిరాక్స్ కేంద్రాల మూసివేత, పరీక్ష కేంద్రంలో సౌకర్యాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటిండెంట్తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం చింతపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు రిజిస్టర్, ఇన్ పేషెంట్లు, ఔట్ పేషెంట్లు, మందులు, ఇతర స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు.
స్థానిక కేజీబీవీకి వెళ్లి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడారు. ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో తాగునీటి సరఫరాతోపాటు పలు అంశాలపై దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్, మిషన్ భగీరథ ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు.