calender_icon.png 2 April, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా పది పరీక్షలు

22-03-2025 12:54:14 AM

పరిశీలించిన కలెక్టర్ బి.సత్య ప్రసాద్ 

జగిత్యాల, మార్చి 21 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మొదలైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా జగిత్యాల జిల్లాలో పలు కేంద్రాలను కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్ హైస్కూల్, పురానణి పేట హైస్కూల్’తో పాటూ కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని  ఎస్‌ఎఫ్‌ఎస్ హైస్కూల్లో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం  11 వేల 8 వందల 55 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, మొత్తం 67 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బి.సత్యప్రసాద్ వివరించారు. కలెక్టర్ వెంట జగిత్యాల, కోరుట్ల ఆర్డిఓలు మధుసూదన్, జీవాకర్’రెడ్డి, జిల్లా విద్యా శాఖాధికారి రాము, ఎమ్మార్వోలు రామ్మోహన్, ఇట్యాల కిషన్, ఎంఈఓ నరేశం తదితరలున్నారు.