27-02-2025 01:47:31 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 26 ( విజయ క్రాంతి), శాసనమండలి ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచారాన్ని ముగించుకున్న నేతలు ప్రలోభాల పరువానికి తెర లేపారు. ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఇద్దరు అభ్యర్థులు నడుమ తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరు అభ్యర్థులు నడుమ తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నది. ఓటర్లకు డబ్బు మద్యం షురూ చేశారు. ఎన్నికలు గురువారం జరుగుతున్న నేపథ్యంలో బుధవారం ఉదయం నుండి ఓటర్ల ను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వారి అనుచరులు ప్రలోభాల పర్వానికి దిగారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ భారీగా కనిపిస్తున్నది ప్రతి ఓటర్ కు 2000 నుంచి 5000 వరకు నగదు చొప్పున పంపిణీ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘ నేతలు సైతం ఉపాధ్యాయుల ఇండ్ల చుట్టూ తిరుగుతూ మద్యంతో పాటు డబ్బులు కూడా అందజేసినట్లు ఆరోపిస్తున్నారు. పట్టభద్రుల అభ్యర్థుల్లో బిజెపి నుంచి అంజిరెడ్డి కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విషయం విధితమే.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సర్వోత్తమ్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా కొమురయ్య బి ఎస్.పి తరపున హరికృష్ణ మరో అభ్యర్థి బాలకృష్ణారెడ్డి ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అభ్యర్థుల అనుచరులు చివరి ప్రయత్నం వరకు కృషి చేశారు. పట్టభద్రులు ఉపాధ్యాయులు మేధావి వర్గం కావడంతో డబ్బులకు మద్యం కు బానిసగా మారిపోటు వేస్తారా లేక మేధావి వర్గమైన వ్యక్తిని గుర్తించి ఓటు వేసి గెలిపిస్తా రో వేచి చూడాల్సిందే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు పట్టబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థులు పొటాపొటిగా ప్రచారాలతో పాటు తమ అనుచరులతో ఓ టర్ల ల ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు.