కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): జిల్లాలో పలుచోట్ల శనివారం రాత్రి వరం కురిసింది. ఆసిఫాబాద్ మండలంలో కురిసిన వరానికి గుండి రోడ్డుపై రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు తెగిపోయింది. దీంతో గుండి, నందుప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రజలు చేరుకోవాల్సి ఉండగా వాంకిడి మండలం కమాన్ మీదుగా ఆసిఫాబాద్‌కు రావాల్సి వస్తుంది. దాదాపుగా 30 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.