calender_icon.png 20 October, 2024 | 2:04 PM

కురిసిన వాన తెగిన తాత్కాలిక వంతెన

20-10-2024 11:10:05 AM

పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): జిల్లాలో పలుచోట్ల శనివారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆసిఫాబాద్ మండలంలో కురిసిన వర్షానికి గుండి వాగుపై రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన తెగిపోవడంతో గుండి, నందుప గ్రామాలకు ప్రధానంగా రాకపోకలు నిలిచిపోగా కానర్గాం, చోర్ పల్లి, దుబ్బగూడాతో పాటు తదితర గ్రామాలకు అంతరాయం ఏర్పడింది. వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామాల జిల్లా కేంద్రానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రజలు చేరుకోవాల్సి ఉండగా వాంకిడి మండలం కమాన మీదుగా ఆసిఫాబాద్ కు రావాల్సి వస్తుందని, దాదాపుగా 30 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈనెల 16న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే గుండి గ్రామాన్ని పర్యటించి బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బ్రిడ్జి నిర్మాణ కళ ఆ గ్రామస్తులకు ఎప్పుడు నెరవేరుతుందో అని వేచి చూస్తున్నారు.