calender_icon.png 18 January, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెంపోను ఢీకొట్టిన బస్సు

21-10-2024 12:46:54 AM

12 మంది మృతి, పలువురికి గాయాలు

రాజస్థాన్, అక్టోబర్ 20: రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టెంపోను ఢీకొట్టిన ఘటనలో 12 మంది మృతిచెందగా పలవురు గాయపడ్డారు.  బారీ కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి శివ లహరి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గుమ త్ మొహల్లాకు చెందిన కొంతమంది టెంపోలో బరౌలి గ్రామంలో పెళ్లి కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా..

కరౌలి హైవే ఎన్ హెచ్ సునిపూర్ గ్రామ సమీపంలో శనివారం రాత్రి వారి టెంపోను.. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపో డ్రైవర్ సహా 12మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళ లు, ఒక పురుషుడు, ఐదుగురు చి న్నారులు, ముగ్గురు బాలికలు ఉన్న ట్లు సమాచారం.

అతివేగం, అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని భావి స్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ స్పం దించారు. రోడ్డు ప్రమాద ఘటన బాధాకరమని, ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరా లని ప్రార్థించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.