26-02-2025 06:48:52 PM
భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ, ముల్కనూర్, కొప్పూర్, వంగర, గట్ల నర్సింగపూర్ గ్రామాలలోని ఆలయాలలో భక్తులు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వంగర గ్రామంలోని శ్రీ కైలాస కళ్యాణి క్షేత్రంలో పీవీ నరసింహారావు సోదరుని కుమారులు పివి మదన్మోహన్ ఆధ్వర్యంలో భక్తులకు విస్తృత ఏర్పాటు చేశారు. కొప్పూర్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో శివునికి అభిషేకాలను ఆలయ వ్యవస్థాపకులు కాసం రమేష్ గుప్తా ఆలయ కమిటీ డైరెక్టర్లు గద్ద రాజమణి సమ్మయ్య యాదవ్, గద్ద సంపత్ ను నిర్వహించారు.
కొత్తకొండ వీరభద్రుని స్వామి వారి ఆలయంలో ఈవో కిషన్ రావు, ఆలయ అర్చకులు కంచనపల్లి రాజయ్య, మొగిలిపాలెం రాంబాబు, తాటికొండ వీరభద్రయ్య ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ముల్కనూర్ లోని సాంబమూర్తి ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలను అర్చకులు మధుకర్ శర్మ నిర్వహించారు. ముత్తారం త్రిక్కుటేశ్వర ఆలయంలో ఆలయ కమిటీ సత్యవతి సురేందర్ రెడ్డి, కాశిరెడ్డి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో భక్తుల కొరకు ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారు. గట్ల నర్సింగాపూర్ గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అన్ని దేవాలయాలలో భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి పూజలు చేశారు.