calender_icon.png 26 February, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాశివరాత్రికి ఆలయాలు ముస్తాబు

26-02-2025 01:21:20 AM

  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

కదిలి రానున్న లక్షలాదిమంది భక్తులు

నిర్మల్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : మహాశివరాత్రి పండుగ పర్వదినానికి నిర్మల్ జిల్లాలోని శైవ క్షేత్రాలు ముస్తాబు చేశారు. బుధవారం మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని భక్తులు శివాలయాలకు వెళ్లి అభిషేకం అర్చన పూజా కార్యక్రమాలను నిర్వహించడం నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కదిలి పాపేశ్వరాలయం బూరుగుపల్లి రాజరాజేశ్వ రాలయం అర్లి సిద్దేశ్వర ఆలయం చీరాల రాజేశ్వర ఆలయం దస్తురాబాద్ గుడిసెరాల స్వామి. నిర్మల పట్టణంలోని వెయ్యి లింగాల గుడి వెంకటాద్రిపెట్ ఓంకారేశ్వరాలయం కనకాపూర్ లోని బ్రహ్మేశ్వర ఆలయం.

సిద్ధిలకుంటలోని సిద్దేశ్వరాలయం ఓలా లోని మహా శివాలయం సూర్యాపూర్ రాజరాజేశ్వరాలయంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు ఉదయం నుండి ఆలయాల్లో అర్చన అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించి శివపార్వతుల కల్యాణం ఊరేగింపు నిర్వహించనున్నారు. ఆయా ఆలయాలకు ప్రత్యేక బస్సులను టీజీ ఆర్టీసీ ద్వారా నడుపుతున్నారు.

ముస్తాబైన ఆలయాలు..

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : శివరాత్రి సందర్భంగా జిల్లా లో శివాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబు అయ్యాయి. ఆలయాలను విద్యు త్ దీపాలతో పాటు పూలతో అలంకరించారు. కాగజ్ నగర్ మండలం ఇస్గాం శివ మల్లన్న ఆలయం వద్ద వేడుకలకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఈవో వేణుగోపాల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని శివాలయం వద్ద కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లను చేపట్టారు.

వాంతిని మండల కేంద్రంలోని శివకేశవ ఆలయం ఉత్సవాలకు ముస్తాబు అయింది. రెబ్బెన మండలం నంబాలలోని శివాలయం శివరాత్రి పర్వదినాన నిర్వహించే వేడుకలకు ఆలయ కమిటీ పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. కెరమెరి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద నెల రోజులపాటు జరగనున్న జాతరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శివరాత్రి సందర్భంగా ఆలయాలలో శివనామస్మరణ మ్రోగనుంది.

సత్యదేవుడు గుడిసెరాల రాజన్న..

దస్తురాబాద్ ఫిబ్రవరి 25 ః భక్తుల పాలిట కొంగు బంగారంగా, కోరిన కోరికలు తీర్చే సత్య దేవుడు గొడిసెర్యాల రాజన్న స్వామిదస్తూరాబాద్ : భక్తుల పాలిట కొంగు బంగారం గా, కోరిన కోరికలు తీర్చే సత్య దేవుడు గొడిసెర్యాల రాజన్న స్వామి వెలుగొందుతు వస్తుంది.శివనమస్మరణతో ఆ రాజేశు డి పూజిస్తే కోరుతున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. గోదావరి ఒడ్డున వెలిసిన రాజేశుడు నిత్యం భక్తులతో పూజలను అందుకుంటున్నాడు.

నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం లోని గొడిసెర్యాల గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రికి ముస్తాబు అయ్యింది. గత 27 సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆలయంలో శివరాత్రి వేడుకలు  అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మహా శివరాత్రి ఉత్సవాలకు అంత సిద్ధం అయ్యిం ది.విద్యుత్ దీపాల అలంకరణ తో వెలిగిపోతున్నాడు.

రేపటి నుండి 3 రోజులతోపాటు ఈ మహా శివరాత్రి ఉత్సవాలు కొనసానున్నాయి.ఉత్సవాల నిర్వహణ ఆలయ అర్చకు లు సిడం లక్ష్మణ స్వామి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా వేరే వేరే జిల్లాల నుండి ఆలయానికి వచ్చే భక్తులు ఏ లాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఎస్‌ఐ శంకర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడు రోజులపాటు ఉత్సవాలు..

3 రోజులు నిర్వహించే ఉత్సవాలలో మొదటి రోజు శివపార్వతిల కల్యాణం, జాగరణ, రెండో రోజు మల్లన్న బోనాలు, పోచ మ్మ బోనాలు, మూడవ రోజు అన్న పూజ ,కుంకుమ పూజ, సామూహిక హోమము, తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు లక్ష్మణ స్వామి తెలిపారు

బుగ్గలో నేడు మహా జాతర..

బెల్లంపల్లి, ఫిబ్రవరి 25 : బెల్లంపల్లి మండలం లోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం మహాశివరాత్రి ని పురస్కరించుకొని మహా జాతర జరగనుంది. ఈ జాతరకు మంచిర్యాల, ఆసిఫా బాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు, మహారాష్ర్ట, గడిచిరోలి ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఎండోమెంట్ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ఇప్పటికే జాతరకు తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

పురాతన శైవ క్షేత్రం గా బాసిల్లుతున్న బుగ్గ గర్భగుడిలో నిత్యం అభిషేకం పొందే శివలింగాన్ని ప్రత్యేకంగా వీక్షించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ఆధ్వ ర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పా ట్లు చేపట్టారు.

బెల్లంపల్లిలోని పాత బస్టాండ్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల నుండి భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ యాజమాన్యం బుగ్గకు ప్రత్యేకంగా బస్సులను కూడా నడిపిస్తుంది. లక్షకు పైగా తరలిరానున్న భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేపట్టాయి.

మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే..

మంచిర్యాల, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరాన ఈ నెల 26న జరగబోయే మహా శివరాత్రి పండుగ ఏర్పాట్లను మంగళవారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు.

గోదావరి పుణ్య స్నానాలకు విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

పకడ్బందీగా మహాశివరాత్రి ఏర్పాట్లు ః సీఐ నరేందర్

లక్షెట్టిపేట, ఫిబ్రవరి 25 : మహాశివరాత్రి వేడుకల్లో భక్తసంద్రానికి ఏలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని సీఐ నరేందర్ అన్నారు. శివరాత్రి సందర్భంగా మంగళవారం గోదావరి నది వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా సీఐ నరేందర్ మాట్లాడుతూ.. నీటిమట్టం ఎక్కువగా ఉన్నందున లోతట్టు ప్రాంతాలకు భక్తులు స్నానాలకు వెళ్లకూడదన్నారు. గోదావరి వద్ద గజ ఈతగాళ్ల ను అందుబాటులో ఉంచామన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. భక్తులు దొంగల బారిన పడకుండా తమ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ నరేందర్ తో పాటు ఎస్సు సతీష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.