calender_icon.png 23 March, 2025 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు

22-03-2025 01:40:33 AM

రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

తలకొండపల్లి,మార్చి 21(విజయక్రాంతి):దేవాలయాలు  ఆధ్యాత్మిక చింతనతో పాటు మానసిక ప్రశాంతతకు నిలయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలోని శివ సీతారామాంజనేయ స్వామి దేవాలయం యొక్క ప్రథమ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.దేవాలయం వార్షికోత్సవంలో పాల్గొనేందుకు గ్రామానికి వచ్చిన శ్రీనివాస్ రెడ్డిని ఆలయ కమిటి సభ్యులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటి ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి,వైస్ చైర్మన్ వెంకటేష్,నరోత్తంరెడ్డి,బాలకుమార్ గౌడ్,నర్శింహారెడ్డిలు గోలి శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి,పర్వతాలుయాదవ్,గిరి,మల్లేష్,చెన్నయ్య,సుదర్శన్ గౌడ్,రాజుయాదవ్,అభినవ్ పాల్గొన్నారు.