23-03-2025 04:30:47 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిసి, శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు అధికారికంగా ఆహ్వానించారు. ఆలయ ప్రధాన అర్చకులు, కార్యనిర్వహణాధికారి రమాదేవి, ఇతర దేవాదాయ శాఖ అధికారులతో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), దేవాదయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao)లను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాలు, పవిత్ర పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రికి మంత్రులకు అందజేశారు. భద్రాచలం శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవం ఏప్రిల్ 17న వైభవంగా జరగనున్న నేపథ్యంలో, ప్రత్యేక ఏర్పాట్లు, భక్తుల రద్దీ, భద్రతా చర్యలు తదితర అంశాలపై అధికారుల ప్రతినిధులు సీఎంతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు, భద్రాచలం ఆలయ ప్రధాన ప్రతినిధులు పాల్గొన్నారు.