27-03-2025 11:24:51 PM
జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మూడు రాష్ట్రాలకు సరిహద్దులోని మూడు రాష్ట్రాల భక్తుల్లో ప్రఖ్యాత గాంచిన మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్గా నియమితులైన పెద్ద షక్కర్గా రామ్ పటేల్ హైదరాబాదుకు తరలి వెళ్లి ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు శాల్వాతో సన్మానించి, కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి 70 కోట్ల నిధులు మంజూరు చేయించినందుకు నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ చైర్మన్ పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
70 కోట్ల నిధులతో ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాలని చైర్మన్ కు పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే సూచించినట్లు తెలిసింది. చైర్మన్ వెంట హైదరాబాద్కు తరలి వెళ్లిన వారిలో మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు డోంగ్లి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు పటేల్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమాన్లు స్వామి, విట్టల్ గురుజి, కొండ గంగాధర్, రమేష్ వట్నల్వార్, రాజు కొండవార్, దిగంబర్ పాండురంగ పాటిల్, అమూల్ ఆలయ పూజారి, వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.