26-03-2025 05:51:21 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల సమీపంలోని మున్నూరు కాపు సంఘ స్థలంలో వెలిసిన మైసమ్మ ఆలయ 2వ వార్షికోత్సవాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వేదపండితులు సంతోష్ శర్మ ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ రుకుం ప్రహ్లాద్, నాయకులు గడ్డల సురేష్, అడప సతీష్ తదితరులు పాల్గొన్నారు.