calender_icon.png 10 January, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు

01-12-2024 01:06:45 AM

  1. తుఫాను ఎఫెక్ట్‌తో ఉపశమనం
  2. మరో మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను ప్రభావం వల్లే శనివారం ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినట్లు తెలిపింది. దీంతో చలి తీవ్ర తగ్గినట్లు పేర్కొంది. ఫలితంగా ప్రజలు చలి నంచి కాస్త ఉపశమనం పొందారు.

ఇదిలా ఉండగా.. తుఫాను కారణంగా రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే చల్లని గాలులు వీస్తాయని ఐఎండీ చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షసూచన ఉన్న జిల్లాల జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట ఉన్నాయి.