సిర్పూర్‌లో కనిష్ఠంగా 7.9 డిగ్రీలు
హైదరాబాద్/కామారెడ్డి, నవంబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గాయి. మంగళవారం కాస్త పెరిగిన ఉష్ణోగ్రతలు.. బుధవారం క్షీణించాయి. రాష్ట్రంలో వేగంగా ఉష్ణోగ్రతలు పతనవుతున్న జిల్లాల్లో మొదటి స్థానంలో ఆసిఫాబాద్ ఉన్నది. ఆ జిల్లాలోని సిర్పూర్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 7.9 డిగ్రీలకు తగ్గాయి. ఈ సీజన్‌లో ఇదే తక్కువ కావడం గమనార్హం.
ఆదిలాబాద్‌లో 9.2 డిగ్రీలు, కామారెడ్డిలో 9.5 డిగ్రీలు, సంగారెడ్డిలో 9.7 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల 10.1 డిగ్రీలు, వికారాబాద్‌లో 10.1 డిగ్రీలు, మెదక్‌లో 10.2 డిగ్రీలు కనిష్ఠంగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. కామా రెడ్డి జిల్లా డొంగ్లీ మండలం ఆరెంజ్ పరిధిలోకి వెళ్లడం ఆందోళన కలిగిస్తుంది. బుధ వారం ఉదయం ఇక్కడ అత్యల్పంగా 9.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
నిజామాబాద్ జిల్లాలో అలూరు, వర్ని, ముప్కాల్ మినహా మిగతా మండలాలన్నీ ఎల్లో అలర్ట్‌లో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో కొట గిరి 10.2 డిగ్రీలు, నిజామాబాద్ ఉత్తరం 10.3, పోతంగల్ 11.0, నిజామాబాద్ రూర ల్ 11.4, బోధన్ 11.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా దక్షిణ కోస్తాకు వర్ష సూచన ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం కారణంగా గురువారం, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తెలంగాణలో ఎలాంటి వర్ష సూచన లేదని, అయితే వాతావరణంలో మార్పులు ఉండొచ్చని చెప్పింది.