17-12-2024 12:40:10 AM
హైదరాబాద్/ఆదిలాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఘోరం క్షీణిస్తున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలి తీవ్రతకు అద్దం పడుతోంది. సోమవారం రాష్ర్టంలోనే అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి (టి) లో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దీంతో జిల్లాలో ప్రజలు ఉన్ని దుస్తులతో రక్షణ పొందగా, పలువురు రైతులు తమ పశువులకు చలి నుంచి రక్షణ కోసం గోనె సంచులను కప్పుతున్నారు. ఉ మ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి చేరుతున్నాయి. గత కొన్ని రోజులుగా జిల్లాలో అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు బారే డు పొద్దెక్కితే గాని ఇంటి నుంచి బయటకు రావడం లేదు. అదేవిధంగా సాయంత్రం కాకముందే ఇంటి ముఖం పడుతున్నారు.
కాగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా బేలలో 6.3 డిగ్రీలు, బోథ్ మండలం పొచ్చారలో 6.4డిగ్రీలు, చెప్రాల, మావల, నేరడిగొండలలో 6.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమో దయ్యాయి. అసిఫాబాద్‌లోని సిర్పూర్‌లో 6.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద్యయాయి. రాష్ట్రంలో మరో రెండు రోజులు పాటు చలి గాలుల తీవ్రత ఉంటుందని ఐఎండీ పేర్కొం ది. ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉమ్మడి నిజామాబాద్‌లో
కామారెడ్డి, డిసెంబర్16 (విజయక్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలను చలి వణికిస్తున్నది. రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని 45 ప్రాంతాల్లో ఆరెం జ్ అలర్ట్ విస్తరించింది. ఉమ్మడి జిల్లా లో సింగిల్ డిజిట్లోకి కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపోవడం ప్రజలను ఆందోళన కల్గిస్తున్నది. గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీల లోపే నమోదు అవుతున్నాయి. సోమవారం అత్యల్పంగా కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో 6.9 డిగ్రీలు నమోదైంది.
జుక్కల్‌లో 7.1 డిగ్రీలు, కోటగిరి, గాంధారిలో 7.8డిగ్రీలు, లింగంపేట్‌లో 7.9డిగ్రీలు, మెండోరాలో 8.2డిగ్రీలు, గుపాన్‌పల్లి నిజామాబాద్ నార్త్‌లో, బీర్కూర్‌లలో 8.3డిగ్రీలు, పాల్వంచలో 8.4డిగ్రీలు, బిచ్కుంద, ఎల్లారెడ్డిలో 8.5, సాలురాలో 8.6, నిజాంసాగర్, మెం డోరాలో 8.7, నాగిరెడ్డిపేట్ పుల్కాల్‌లో 8.8, పోతంగల్, రుద్రూర్‌లో 8.9, పిట్లం, పెర్కిట్‌లో 9.0, మాచారెడ్డిలో 9.1, ఆసంపల్లిలో 9.2, నిజామాబాద్ సౌత్ బెల్లాల్, రామారెడ్డిలో 9.3, బాల్కొండలో 9.4, డిచ్‌పల్లిలో 9.5, మోస్త్రా, పాల్దా, ఇస్సాపల్లి 9.6, మంచిప్ప, రాజంపేట్‌లో 9.7, నిజామాబాద్ నార్త్‌లో 9.8, తూంపల్లిలో 9.9, చందూర్, నందిపేట్‌లో 10.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.