03-03-2025 12:33:29 AM
హైదరాబాద్, మార్చి 2: ఖైరతాబాద్‌లోని ఐఐఎంసీ కళాశాల సభా ప్రాంగణంలో యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, కిన్నెర ఆర్ట్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం తెలుగు వెలుగు 5వ సమావేశం నిర్వహించారు.
కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ప్రొఫెసర్ వంగపల్లి విశ్వనా థం మాట్లాడుతూ.. రథాన్ని ఏ విధంగానైతే అంతా కలిసి ముందుకు లాగుతారో.. తా ము తలపెట్టిన తెలుగువెలుగు కార్యక్రమా న్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు చెప్పారు. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి రజిని మాట్లాడుతూ.. సైనికులు దేశాన్ని కాపాడినట్లు, భాషాభిమాను లు తెలుగును సంరక్షించుకోవాలన్నారు.
కిన్నెర ఆర్ట్స్ సంస్థ కార్యదర్శి ఎం రఘురాం మాట్లాడుతూ ఐఐఎంసీ కాలేజీ తెలుగు భాషా ప్రచార కార్యక్రమాలకు దేవాలయం లాంటిదని కొనియాడారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, ఇరువెంటి వెంకటేశ్వర శర్మ, డాక్టర్ ఉప్పలపాటి కుసుమకుమారి, డాక్టర్ ఫణీంద్ర, ఐఎంసీ కాలేజీ ప్రిన్సిపల్ కూర రఘువీర్, యువభారతి కార్యదర్శి వెంకటరావు, రవీం ద్ర, అశ్వినికుమార్ పాల్గొన్నారు.