పుణే: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో వరుస విజయాలతో జోరు ప్రదర్శించి ఒక దశలో టాప్ చేరుకున్న తెలుగు టైటాన్స్ తాజాగా రెండో ఓటమితో ఢీలా పడింది. బుధవారం పుణే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 33 యూపీ యోధాస్ చేతిలో ఓటమి చవిచూసింది. టైటాన్స్ తరఫున విజయ్ మాలిక్ 11 పాయింట్లతో సూపర్ టెన్ సాధించగా.. యూపీ తరఫున భవానీ రాజ్‌పుత్ 7 పాయింట్లు సాధించాడు.
టైటాన్స్‌కు ఇది రెండో ఓటమి కాగా.. పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 39 తేడాతో హర్యానా స్టీలర్స్‌పై విజయం సాధించింది. బెంగాల్ తరఫున మణిందర్ సింగ్ (11 పాయింట్లు) సూపర్ టెన్‌తో మెరవగా.. హర్యానా జట్టులో రెయిడర్ వినయ్ సూపర్ 10 సాధించాడు. నేటి మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో యూపీ యోధాస్, జైపూర్‌తో యు ముంబాతో ఆడనుంది.