calender_icon.png 20 April, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ టాప్‌లో మనోళ్లే

20-04-2025 12:17:12 AM

వంద పర్సంటైల్‌తో తెలంగాణ నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఒక్కరు

110 మంది ఫలితాల విడుదల నిలుపుదల

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటిచిన జేఈఈ మెయిన్ సెషన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. శుక్రవారం అర్థరాత్రి ఫలితాలను ఎన్టీఏ ఈమేరకు ప్రకటించింది. తెలంగాణ నుంచి ముగ్గురు విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక విద్యార్థి టాప్‌లో నిలిచారు. మొత్తం 20 మంది వంద పర్సంటైల్ సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి మన విద్యార్థులే న లుగురు ఉండడం విశేషం. తెలంగాణ నుంచి హర్ష్ ఏ గుప్తా,  వంగాల అజయ్ రెడ్డి, బనిబ్రాత మాజీ ఉంటే, ఏపీ నుంచి సాయి మనోజ్ఞ ఉన్నారు.

వంద పర్సంటైల్ సాధించిన టాప్ 20 మందిలో మనోళ్లే నలుగురు ఉన్నారు. టాప్ 100 ర్యాంకుల్లో తెలుగు వి ద్యార్థులు హవా కొనసాగగా, 99 పర్సంటైల్‌కుపైగా సాధించిన వారిలోనూ తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. అయితే 300 మార్కులకి 300 మార్కులను వంగాల అజయ్ రెడ్డి, బనిబ్రాత మాజీ సాధించారు. ఈ ఏడాది మొత్తం 10.6 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, 9.92 లక్షల మంది హాజరయ్యారు.

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోరును పరిగణలోకి తీసుకొని ర్యాంకులు కేటాయించారు. ఆతర్వాత రిజర్వేషన్లను అనుగుణంగా మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత కల్పిస్తారు. అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 18న జరగనుంది. దరఖాస్తులు ఈనెల 23 నుంచి మే 2 వరకు స్వీకరించనున్నారు. స్కోర్ కార్డును వెబ్‌సైట్‌లో ఉంచారు. 

110 మంది ఫలితాలు నిలుపుదల

110 మంది  అభ్యర్థుల ఫలితాలను ఎన్టీ ఏ నిలిపివేసింది. వీరు అక్రమాలకు, ఫోర్జరీ పత్రాలను ఉపయోగించినట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. ఈ డబ్ల్యూఎస్ విభాగంలో 80.383 స్కోర్‌ను కటాఫ్‌గా, జనరల్ విభాగంలో 93.102, ఓబీసీ 79.4 31, ఎస్సీ కటాఫ్‌గా నిర్ణయించారు.