calender_icon.png 6 March, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు

06-03-2025 12:33:39 AM

రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీణ్ మృతి

షాద్‌నగర్, మార్చి 5 (విజయక్రాంతి): ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మ  తెలుగు విద్యార్థి దుండగుడి కాల్పుల్లో బలయ్యాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట్  మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు, రమాదేవి మెడికల్ దుకాణం నడుపుతున్నారు.

వీరికి కొడుకు ప్రవీణ్(27), కూతురు ఉన్నారు. ప్రవీణ్(27) అమెరికాలోని విస్కాన్సిన్ మిల్వాకీలో నివాసం ఉంటూ ఓ యూనివర్సిటీలో ఎంఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

ఖర్చుల కోసం ఓ హోటల్‌లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. బుధవారం అతడి ఇంటి సమీపంలోని బీచ్‌లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడటంతో ప్రవీణ్ తీవ్రంగా గాయపడి ఘటన స్థలంలోనే మృతిచెందాడు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో తీవ్ర విషాదంలో మునిగారు.