calender_icon.png 1 November, 2024 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమీక్ష

06-07-2024 05:40:08 PM

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం  సాయంత్రం 6 గంటలకు హైదరా బాద్‌లోని ప్రజాభవన్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిలు సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజన అంశాలపై ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం అజెండా ఖరారు అయింది.

పది అంశాల అజెండాను సిద్ధం చేసిన తెలుగు రాష్ట్రాలు విభజన చట్టం 9, 10 షెడ్యూల్ లోని సంస్థల ఆస్తులపై చర్చించే అవకాశం ఉంది. షీలా బిడే కమిటీ సిఫారసులను సమీక్షించనున్న ఇద్దరు సీఎంలు విద్యుత్ బకాయిలు, ఏపీఎఫ్ సీ అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య 15 ఈఏసీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై, ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలపై సమీక్షిస్తారు.

ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై, హైదరాబాద్ లోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చలు జరగానున్నాయి. విభజన చట్టం 9, 10 షెడ్యూల్ లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు, విభజన పూర్తికాని సంస్థల బ్యాంకు ఖాతాల్లో రూ.8 వేల కోట్లు, పదేళ్లుగా బ్యాంకుల్లో ఉన్న రూ.వేల కోట్లు నిధులపై చర్చిస్తారు.

రెండు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా ఆయా సంస్థలకు చెందిన రూ.8 వేల కోట్లు వినియోగించుకోలేదు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కోరత ఉంది. దీంతో 9వ షెడ్యూల్ లోని సంస్థల్లో ఏపీ జెన్ కో విలువ రూ.2,448 కోట్లు, 10 షెడ్యూట్ లోని రూ.2,994 కోట్లుగా నిర్థారణ జరిగింది. ఆయా నిధులు నుంచి రూ.1,559 కోట్లు పంచుకున్న రెండు రాష్ట్రాలు, రూ.1,435 కోట్ల విషయంలో పంచాయితీ ఇంకా తేలలేదు.