హైదరాబాద్,(విజయక్రాంతి): విభజన సమస్యలపై హోంశాఖలో తెలుగు రాష్ట్రాల అధికారుల భేటీ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం(Andhra Pradesh Bifurcation Act)పై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్(Union Home Secretary Govind Mohan) సమీక్షించారు. ఏపీ విభజన చట్టం 9,10 షెడ్యూల్ లోని సంస్థల విభజనపై అమలుపై రెండేళ్ల తర్వాత హోంశాఖ లోతుగా సమీక్షించింది. 9,10 షెడ్యూల్ లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలపై చర్చించినట్లు సమాచారం. న్యాయ సలహాలు తీసుకుని ముందుకెళ్లాలని, అలాగే సమన్వయంతో ఇరురాష్ట్రాలు సమస్యలు పరిష్కరించుకోవాలని అధికారులు నిర్ణయించారు.