స్టార్ హీరో అజిత్‌కుమార్ ప్రస్తుతం కార్ రేసింగ్ పోటీల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లో ఆయన జట్టు మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. నటుడిగానే కాకుండా రేసర్‌గా రాణించిన అజిత్‌పై అందరూ ప్రశంసల జల్లు కురిపించారు. ఇదిలా ఉండగా అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘విడాముయర్చి’కి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు మేకర్స్.
ఈ సినిమాను తెలుగులో ‘పట్టుదల’ పేరుతో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఫస్ట్ లుక్‌ను సైతం విడుదల చేశారు. మరోవైపు ఈ సినిమా ట్రైలర్ సైతం సాయంత్రం ఓ ప్రైవేటు టీవీ ఛానల్ వేదికగా లాంచ్ చేశారు. అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ 62వ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తుండగా, త్రిష కథానాయికగా నటిస్తోంది. ‘ఎంత వాడు గాని’ తర్వాత అజిత్-, త్రిష కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్ల భారీ అంచనాలున్నాయి.