calender_icon.png 18 January, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగుపై అనురక్తి కలిగేలా బోధించాలి

11-07-2024 02:38:20 AM

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): తెలుగుపై రేపటి పౌరులకు అనురక్తి కలిగేలా పాఠాలు బోధించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఏపీలోని విశాఖపట్నంలో బుధవారం ఆయన భాషావేత్తలు, సాహితీవేత్తలు రూపొందించిన ‘విజయ నిఘంటు చంద్రిక’ ఈ- ప్రారంభించి మాట్లాడారు. మాతృభాషను పిల్లలకు మరింత చేరువ చేసేందుకు సాహితీ వేత్తలు, ఉపాధ్యాయులు, రచయితలు, కవులు కృషి చేయా లన్నారు. సరికొత్త మార్గాలను అన్వేషించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన పద్ధతులు మారాలన్నారు. ఇప్పటికే ఆంధ్రభారతి రూపంలో ఈ నిఘంటువు అందుబాటులో ఉందని, ఇప్పుడు విజయ నిఘంటు చంద్రిక అందుబాటులోకి రావ డం శుభపరిణామమని కొనియాడారు. తె లుగువారంతా మేల్కొని తెలుగు సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు కృషి చేయాలన్నారు. లేదంటే మాతృభాష క్షీణించే దశకు వెళ్తుందన్నారు. వేళ్లకు చెదలు పట్టినప్పుడు మ హావృక్షమైనా కూలిపోతుందని, అదే పరిస్థితి భాషకు రానీయొద్దని సూచించారు.