calender_icon.png 18 March, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

టెక్నీషియన్స్‌ను తెలుగువారు గొప్పగా చూస్తారు

17-03-2025 12:43:56 AM

శుశాంత్, జాన్యజోషి, విధి వంటి న్యూ ట్యాలెంట్‌ను పరిచయం చేస్తున్న చిత్రం ‘కిస్ కిస్ కిస్సిక్’.  శివ్ హరే దర్శకత్వంలో ఈ సినిమాను విధి గణేశ్ ఆచార్య నిర్మిస్తున్నారు. ఈ బహుభాషా చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తోంది. మార్చి 21న విడుదల సందర్భంగా మేకర్స్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గణేశ్ ఆచార్య మాట్లాడుతూ.. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో నటులకు, టెక్నీషియన్స్‌ను గౌరవిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో దాదాపు ఐదేళ్లు పనిచేశాను. గొప్ప సంస్థ ఇది’ అన్నారు. ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ‘గణేశ్ ఆచార్య ఈ సినిమాను చాలా లావిష్‌గా తీశారు’ అని చెప్పారు.

‘ఈ సినిమా మంచి కమర్షియల్ ప్యాకేజ్‌లా ఉంటుంది’ అని హీరో సుశాంత్ తెలిపారు. ‘పాటలు, కథ, కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ ఉంటాయి’ అని నటి జాన్య జోషి అన్నారు. ‘చాలా ఇష్టం, ప్రేమతో ఈ సినిమా చేశాం’ అని మరో నటి విధి చెప్పారు.