calender_icon.png 16 November, 2024 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వేలో తెలుగు మిథ్య

16-11-2024 01:07:23 AM

  1. స్థానికులను పట్టించుకోని రైల్వే శాఖ
  2. ఆంగ్లం, హిందీలోనే సమాచారం
  3. ఇతర రాష్ట్రాల్లో స్థానిక భాషకే ప్రాధాన్యం
  4. కేంద్ర మంత్రి చెప్పినా మారని తీరు

హైదరాబాద్, నవంబర్ ౧౫ (విజయక్రాంతి): రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేవలు అందిస్తున్న దక్షిణ మధ్య రైల్వే అధికారుల తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ప్రజలు మాట్లాడే భాషకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా వారు వ్యవహారిస్తున్నారు.

సౌత్ సెంటర్ల రైల్వే పేరిట ఫేస్‌బుక్, ఎక్స్ ఖాతాల ద్వారా ఇస్తున్న సమాచారాన్ని అంతా పూర్తిగా హిందీ, ఇంగ్లీషులోనే అందిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో  దాదాపుగా 90శాతం పైగా ప్రజలు తెలుగు మాట్లాడతారు. అయినా కూడా అధికారులు తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

రైల్వే సమాచారం..

రైల్వేకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా నే రైల్వే అధికారులు పంచుకుంటున్నారు. అయి తే హిందీ, ఇంగ్లీష్ వచ్చిన వారికి సమస్య లేదు. కానీ కేవలం తెలుగు మాత్రమే చదివి అర్థం చేసుకునే చాలా మందికి ఇబ్బందులు ఏర్పడుతు న్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిషా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్ తదితర ప్రాంతీయ భాషలు మాట్లాడే రాష్ట్రాల్లో అక్కడి రైల్వే అధికారులు ఖచ్చితంగా ఆయా స్థానిక భాషల్లోనే సమాచారం అందిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ద.మ రైల్వే అధికారులు మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. 

కేంద్ర మంత్రి చెప్పినా తీరు మారలే..

గత నెల 24న సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ద.మ.రైల్వే జోన్ పరిధిలోని ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రయాణికులకు సమాచారాన్ని ఖచ్చితంగా తెలుగు ఉండేలా చూడాలని అధికారులను  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. అప్పుడు ఒప్పుకున్న  అధికారులు ఇప్పటికీ మార్పులు, చేర్పులు చేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుపై ఇంత నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి చెప్పినా మారని రైల్వే అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 

తెలుగుపై ఇంత నిర్లక్ష్యమేలా

రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలోని ప్రజలకు సమాచారం అందించే క్రమంలో తెలుగును  రైల్వే శాఖ పూర్తిగా విస్మయించడం దారుణం. రైల్వే శాఖకు స్థానిక భాష పట్ల ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనం. వెంటనే తెలుగు భాషలోనే సమాచారం అందించాలి. లేదంటే ఆందోళన చేపడతాం. 

 బడేసాబ్, రాష్ట్ర తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు