28-04-2025 05:44:42 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఐఎస్ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహితీ, సాంస్కృతిక సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో వచ్చే నెల 10, 11 తేదీలలో ఏలూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న శ్రీశ్రీ కళావేదిక సాహితీ పట్టాభిషేక మహోత్సవాలు, ప్రపంచ తెలుగు సాహితీ సంబరాల గోడపత్రికను సోమవారం మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కలెక్టరేట్ లోని విద్యాశాఖ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఏ. రవీందర్ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి పసునూరి రాజేంద్రప్రసాద్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహస్వామి, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్, శ్రీశ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గుర్రపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.