calender_icon.png 8 January, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటినుంచే తెలుగు భాష ఉద్యమం

05-01-2025 01:41:11 AM

  • అప్పుడే మన భాషను బతికించుకోగలం
  • సినిమాల పేర్లు, కోర్టు తీర్పులు తెలుగులోనే ఉండాలి
  • ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాం తి): తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనంందరిపై ఉందని, ఆ ఉద్య మం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మానవ మేథ మాతృభాషలోనే వికసిస్తుందని.. తల్లి కడుపులో శిశువు పెరుగుతున్న క్రమంలోనే ఈ వికాసం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

పరాయి భాషలో ఎంత అధ్యయ నం చేసినా,  నైపుణ్యం అలవడినా ఆ స్థాయిలో మేథస్సు వికసించందని తెలిపారు. శనివారం హైదరాబాద్ హెచ్‌ఐసీసీ లో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12 వ ద్వువార్షిక మహాసభలకు  కిషన్ రెడ్డి హాజరయ్యారు. 

ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఒకే వేదికపైకి రావడం తెలు గు భాష, సాహిత్యం, కళలు, సంప్రదాయా ల కోసం పాటుపడడం చాలా సంతోషం గా ఉందన్నారు. ప్రస్తుతం చాలా మంది  మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారని.. కనీసం రాయలేకపోవడం బాధాకర మన్నారు.  సోషల్ మీడియాలో లేఖలను, తెలుగు పదాలను కూడా ఇంగ్లిష్‌లో రాస్తున్నారని తెలిపారు. కోర్టు వాదనలు, ప్రతి వాదనలు, కోర్టు తీర్పులు తెలుగులోనే ఉండాలన్నారు 

నిజాం కాలంలో అణచివేత

నిజాం కాలంలో తెలుగు భాషపై అణచివేత కొనసాగిందని, ఉర్దూ మీడియం స్కూల్సే ఉండడంతో ఆ భాషనే తెలుగు వాళ్లు చదువుకోవాల్సి వచ్చిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.  నిజాం నిర్బంధంలోనే  నాడు గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ పేరిట తెలుగు భాషను పరిరక్షించు కు నేందుకు అనేక పోరాటాలు సాగాయన్నారు.

ఇంగ్లిష్ నేర్చుకుంటేనే ఉద్యోగం, అభివృద్ధి అనేది గత వలస పాలకులు అందించిన చీకటి వారసత్వమని దాన్ని మనం వదిలించుకోవాలన్నారు. ఒక జాతి చరిత్ర, సంస్కృతుల వికాస పరిరక్షణలో ఆ జాతీయులు మాట్లాడే భాషలదే కీలక పాత్ర అన్నారు.  అందుకే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంలో మాతృభాషకు పెద్దపేట వేశారని, భారతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలు తీసుకొ చ్చేందుకు  కేంద్రం కృషి చేస్తోందన్నారు.