హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2(విజయక్రాంతి) : తెలుగు భాష చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బడే సాబ్ అధ్యక్షతన నల్లకుంట శ్రీధర్ ప్లాజాలో జరిగిన సమావేశంలో “2025 క్యాలెండర్”ను ప్రముఖ కవి, విమర్శకులు రామకృష్ణ చంద్రమౌళి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ తెలుగు భాష చైతన్య సమితి “దశాబ్ది ఉత్సవాలకు”సంబంధించిన కార్యాచరణపై విస్తృత సమావేశం ఏర్పాటు చేసి చర్చించినట్లు తెలిపారు. మే రెండోవారంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన వేదికను సమావేశ షెడ్యూల్‌ను ప్రకటించారు.ఈ కార్యక్రమంలో తెలుగు భాష చైతన్య సమితి ప్రధాన కార్యదర్శి డా.ఎడ్ల కల్లేశ్. ఉపాధ్యక్షుడు కేవీ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.