calender_icon.png 1 April, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

29-03-2025 10:36:21 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బూర్గంపాడు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఐటిసి కార్మిక గుర్తింపు సంఘం టిఎన్టియుసి ఆధ్వర్యంలో మండలంలోని పలు ప్రాంతాలలో గల అన్ని నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి పార్టీ జెండా ఎగురవేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు, మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి జగదీశ్వర్ రావు, జిల్లా నాయకులు గల్లా నాగభూషణం, చావ మహేశ్వర్ రావు, మైనార్టీ నాయకులు అజీజ్, కంచేటి వెంకటేశ్వర్ రావు, కాకర్ల సత్యనారాయణ, తెలుగు యువత అధ్యక్షులు నెట్టెం భాస్కర్, ఐటిసి టిఎన్టియుసి అధ్యక్షులు కనకమెడల హరిప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ కరి రాజేంద్ర ప్రసాద్, కార్యవర్గ సభ్యులు చావ రవి,సుబ్బారావు, పిడుగు కొండల రావు, పోటు నరేష్, కుందేటి శ్రీనివాస్, సాయి బాబు, టీడీపీ నాయకులు నరసింహారావు పాల్గొన్నారు.