calender_icon.png 1 April, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిలో తెలుగుదేశం పార్టీ విర్భావ దినోత్సవ వేడుకలు

29-03-2025 04:51:35 PM

భద్రాచలం,(విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం భద్రాచలంలోని కూనవరం రోడ్డులో ఎన్టీఆర్  విగ్రహం వద్ద భద్రాచలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా తోలుత పార్టీ జెండాను కృష్ణా జిల్లా మోపిదేవి జేడ్పీటీసీ సభ్యులు మెడబెలిమి  మల్లికార్జున  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాల అయిన సందర్భంగా పేద ప్రజల కొరకు ఆరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారు అన్నారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చి నా ఏకైక రాజక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు.

భద్రాచలం అభివృద్ధి సైతం తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని, రామాలయం అభివృద్ధి కరకట్ట నిర్మాణం సెంట్రల్ లైటింగ్ తాళి పేరు ప్రాజెక్టు భద్రాచలం నుండి లొట్టిపిట్ట గండి వరకు అనేక రోడ్లు నిర్మాణాలు బ్రిడ్జిలు తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్మించినట్టు తెలిపారు.  ఈ కార్యక్రమంలో భద్రాచలం సొసైటీ అధ్యక్షులు అబ్బినేని  శ్రీనివాసరావు కుంచాల రాజా రామ్ తాళ్లూరు చిట్టిబాబు దాసయ్య గారు కొడాలి చంటి గున్నం  రమేష్ కొర్లపాటి రాము క పోటు రాంబాబు బోడె పూడి  కృష్ణమూర్తి సుంకర రాకేష్ నర్రా శ్రీనివాస్ పొట్లూరి రాజేంద్రప్రసాద్ మద్దిపాటి రాము పోటువెంకటేశ్వర్లు  బాచినేని రామకృష్ణ దొడ్డ పనేని  సుదీప్  బోడెపుడి వెంకటేశ్వరరావు పోటు నరేష్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు .