29-03-2025 07:09:54 PM
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో శనివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పుట్ట ఉపేందర్ యాదవ్ కింట్లు రోజ్ ఆధ్వర్యంలో ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెం గ్రామంలో టిడిపి జెండా ఆవిష్కరణ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అనంతరం స్థానిక ఇల్లందు బుగ్గ వాగు బ్రిడ్జి వద్ద ఉన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీ పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు అధికారం చేపట్టిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందని కూడు, గూడు గుడ్డ నినాదంతో ఆరోజు పార్టీ స్థాపించి పేద ప్రజలకు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన దేవుడు ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా కల్పించిన మహా నేత, బీసీలకు రాజకీయాలలో ముందుకు తీసుకువచ్చి, ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయ ఎదుగుదలకు కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
పేద ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రన్నారు రానున్న రోజులలో చంద్ర బాబు గారి ఆధ్వర్యం లో తెలంగాణ లోనూ తెలుగు దేశం జెండా రెప రెప లాడుతుందను ఆశాభవం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోటిడిపి నాయకులు నూతనపాటి వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్సీ సెల్ నాయకులు సాల్మన్ రాజు, బీసీ సెల్ నాయకులు గూళ్ళ మొగిలి, మూగల ఉపేందర్, శ్యామ్ కుమార్, రాయల సురేష్, రాంబాబు టిడిపి ఇల్లందు మండల తెలుగు మహిళ మండల అధ్యక్షురాలు బాలాజీ నగర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పుట్టా అరుణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.