29-03-2025 08:01:59 PM
మునగాల: మండల కేంద్రములో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శనివారం ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంచుకున్నారు. నాదెండ్ల గోపాలరావు మాట్లాడుతూ... నందమూరి తారకరామారావు పేద ప్రజల కొరకు తెలుగుదేశం పార్టీ పెట్టి 43 సంవత్సరాలు అయిందని, పార్టీ స్థాపించిన 9 నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు.