29-03-2025 07:14:12 PM
తెలంగాణలో తెదేపాకు పూర్వ వైభవం రావడం ఖాయం...
టిడిపి మాజీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర రావు...
కోదాడ: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని తెదేపా మాజీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర రావు అన్నారు. శనివారం తెదేపా 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఖమ్మం క్రాస్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా బస్టాండ్ వద్దకు చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
పార్టీ శ్రేణులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు పార్టీలో పెద్దపీట వేశారని తెలుగు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. నాడు అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్నాయని పేద ప్రజల దేవుడు ఎన్టీఆర్ అని అన్నారు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి భయ్యా నారాయణ, కోడె వాసు,గుల్లపల్లి సురేష్, దొడ్డ గురవయ్య, కొల్లు నరసయ్య, కొల్లు సత్యనారాయణ, గుండు నాగేశ్వరరావు చాపల శ్రీనివాసరావు, పిట్టల శోభన్ బాబు, కొల్లు నరసయ్య, గుండు నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.