calender_icon.png 7 February, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా తెలుగు సినిమా దినోత్సవం

07-02-2025 01:02:03 AM

తొలి తెలుగు టాకీ చిత్రం భక్తప్రహ్లాద (1931) విడుదలైన రోజైన ఫిబ్రవరి 6వ తేదీని తెలుగు సినిమా దినోత్సవంగా ఇకపై ప్రతి ఏటా నిర్వహించాలని నిర్ణయించింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఈ వేడుకలో భాగంగా ప్రభుత్వం అందించే అవార్డులతోపాటు, ఛాంబర్ తరఫు నుంచి వివిధ కేటగిరీ ల్లో అవార్డులు అందించాలనే ఈ సందర్భం గా తీర్మానించారు.

తెలుగు సినిమా పుట్టిన రోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఛాంబర్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. “తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున తెలుగు సినిమా దినోత్సవం మొదటిసారి చేశాం. ఇకపై ఏటా పాత తరం కళాకారులకు సన్మానాలు చేస్తాం’ తెలిపారు.

‘ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గొప్పదనాన్ని మనం గర్వంగా చెప్పుకుందాం’ అని ఛాంబర్ సెక్రెటరీ ప్రసన్నకుమార్ అన్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి అనుపమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇవాళ బీజం వేశాం. రాబోయే రోజుల్లో మహా వృక్షంగా మారి అందరికీ తెలుగు సినిమా గొప్పదనం తెలిసేలా నిర్వహిస్తాం’ అన్నారు.

సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ మాట్లాడుతూ.. ‘సినిమా పరిశ్రమలో అన్ని విభాగాల వాళ్లు సమన్వయం చేసుకుని నిర్వహిస్తే ఇంకా బావుంటుంది’ అని చెప్పా రు.

సీనియర్ రచయిత పరిచూరి గోపాలకృష్ణ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, సీనియర్ సినీ జర్నలిస్ట్, రచయిత రెంటాల జయదేవ పాల్గొన్నారు.