calender_icon.png 19 April, 2025 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెల్లబల్లి సింగిల్ విండో డైరెక్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి

19-04-2025 12:46:25 PM

కోదాడ: తెల్లబల్లి సింగల్ విండో డైరెక్టర్, వాయిల సింగవరం గ్రామవాసి నేరెళ్ల సైదులు అర్ధరాత్రి కొమరబండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మామిడి కాయలను సూర్యాపేటలో అమ్మి తిరుగు ప్రయాణంలో బైపాస్ రోడ్డు దాటుతుండగా వెనక నుండి డిసిఎం కొట్టడంతో ట్రాక్టర్ పై కూర్చున్న సైదులు కిందపడి తలక బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.